ETV Bharat / state

Negligence in Yellampally Project Rehabilitation Package : పరిహారం పక్కదారి.. ఎల్లంపల్లి ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో నిర్లక్ష్యం.. గ్రామస్థుల ఆవేదన

Negligence in Yellampally Project Rehabilitation Package : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో పరిహార చెల్లింపు ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ పూర్తైనా పరిహార చెల్లింపులో మాత్రం ఎనలేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. పునరావాస బాధితులను పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జాబితా రూపొందిస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Negligence in Yellampally Project Rehabilitation Package
Yellampally Project Rehabilitation Package
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 9:22 PM IST

Negligence in Yellampally Project Rehabilitation Package పరిహారం పక్కదారి ఎల్లంపల్లి ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో నిర్లక్ష్యం గ్రామస్థుల ఆవేదన

Negligence in Yellampally Project Rehabilitation Package : పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు(Sripada Yellampally Project) నిర్మాణ క్రమంలో ఎల్లంపల్లి, ముర్మూర్‌, పొట్యాల, మద్దిరాల, పాలకుర్తి, వేంసూరు, కుక్కల గూడూరు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూములను సేకరించారు. తొలుత కొంత పరిహారం చెల్లించినా.. పూర్తిస్థాయి పరిహారం చెల్లింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయా గ్రామాల్లో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2004 జులై 8న నిర్మాణం చేపట్టగా.. 2013లో పూర్తి అయ్యింది. అయితే 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం చెల్లిస్తామన్న జాబితాలో అవకతవకలు జరిగాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sripada Yellampally Project Latest News : ముర్మూరు గ్రామంలో 2019లో అర్హులు 348 మందిగా తేల్చిన అధికారులు.. తాజా జాబితాలో 270 మందిగా తేల్చారు. పొట్యాల గ్రామంలో 2019లో 70 మంది కాగా.. తాజా జాబితాలో 336, మద్దిరాలలో 75 ఆ తర్వాత 66, కుక్కలగూడూరులో 2019లో 11 మంది కాగా తాజా జాబితాలో మాత్రం 101 మంది ఉన్నట్లు జాబితా రూపొందించడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ విలువైన భూములు సేకరించడంతో ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు పంపు ఓపెన్ చేసిన అధికారులు.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

'శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 2009లో ఇళ్లు, భూమి కోల్పోయాం. మాకు వ్యవసాయ భూమి అయితే ఏం లేదు. తర్వాత ప్లాట్లు ఎలాట్ చేయడం జరిగింది. వాటిల్లోనే ఇళ్లను నిర్మించుకున్నాం. 1.1.2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులకు పరిహారం ఇస్తామని జీవో రావడం జరిగింది. దాని ప్రకారమే సర్వే చేశారు. సర్వేలో 137 పేర్లను ఎమ్మార్వో ఇవ్వడం జరిగింది. నాకు నలుగురు సిస్టర్స్​. అందులో వాళ్ల పేర్లు ఉన్నాయి. ఆ లిస్ట్​ను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఫేక్​ లిస్ట్​ను తయారుచేశారు. దీని గురించి అధికారుల దగ్గరకు వెళ్లినా వారు స్పందించట్లేదు.' -గ్రామస్థుడు

ప్రాజెక్టులో నిజమైన నిర్వాసితులకు న్యాయం చేయాలి..: ప్రాజెక్టు నిర్మాణం కోసం విలువైన భూములు ఇచ్చినప్పుడు 18 ఏళ్లు నిండిన యువత ఉపాధి కోసం రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు నిర్వాసిత గ్రామాల వారా కాదా.. పరిశీలించి విద్యార్హత సర్టిఫికెట్లు(Education Certificates) పరిశీలించి జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే అధికారులు రూపొందించిన జాబితాలో గ్రామస్థులు కాకుండా బయటి వారి పేర్లను నమోదు చేశారని.. ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను చేర్చడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిజమైన నిర్వాసితులను గుర్తించి తమకు న్యాయం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Yellampalli 25 Gates Open : ఎల్లంపల్లి ప్రాజెక్టు 25గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

Telangana projects Rains : భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. వరదతో ప్రాజెక్టులకు జలకళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.