ETV Bharat / state

'అందరి సమన్వయంతో సమస్యలు పరిష్కారమవుతాయి​'

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్​ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పాల్గొన్నారు. తమ ప్రాంతాలను పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేయాలని ఎంపీ తెలిపారు.

author img

By

Published : Feb 26, 2020, 11:53 AM IST

mp venkatesh neta and mla korakanti chandar attend pattana pragathi program in peddapalli ramagundam
'అందరి సమన్వయంతో సమస్యలు పరిష్కారమవుతాయ్​'

అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తే పట్టణంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక ప్రాంతంలోని 15 డివిజన్లలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్​తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డివిజన్లలోని పలు సమస్యలను ప్రజలనడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ వంటివి స్వయంగా పరిశీలించారు. పట్టణాలను అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని.. దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ అనిల్ కుమార్​తో పాటు కమిషనర్ ఉదయ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.