ETV Bharat / state

మొక్కలు నాటడాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాలి: మంత్రి కొప్పుల

కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటడమే శరణ్యమని.. ప్రతి ఒక్కరూ దానిలో భాగస్వామ్యమై ఒక యజ్ఞంలాగా ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి కొప్పుల ఈశ్వర్​ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఎంపీ వెంకటేశ్​ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్​లతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

Minister Koppula Green Challenge Program at Ramagundam in Peddapalli
మొక్కలు నాటడాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాలి: మంత్రి కొప్పుల
author img

By

Published : Oct 21, 2020, 7:19 AM IST

మారుతున్న వాతవారణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. మొక్కలు నాటడం ఒక యజ్ఞంలాగా సాగాలని రాష్ట్రమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈమేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో గ్రీన్ ఇండియాలో భాగంగా ఎంపీ వెంకటేశ్​ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, జిల్లా జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్​లతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్​కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​కు అపూర్వ స్పందన వస్తుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటడమే శరణ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రైతు వేదిక నిర్మాణాలు గడువులోగా పూర్తవ్వాలి: కలెక్టర్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.