ETV Bharat / state

Making Tiles with Plastic : ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్‌ తయారీ.. ప్రకృతి పరిరక్షణ కోసం యువకుడి కృషి

Plastic Tiles Manufacture : కరోనా.! అనేక సమస్యలతో పాటు సరికొత్త మార్గాలను చూపింది. దాన్ని అందిపుచ్చుకొని కొందరు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఆ కోవకు చెందిన వాడే ఆ యువకుడు. ప్లాస్టిక్ వర్థ్యాల నుంచి టైల్స్‌ తయారీ చేస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. భిన్నంగా ఆలోచించి ప్రకృతి పరిరక్షణలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. పర్యావరణహితానికి కృషి చేస్తున్న ఆ యువకుడి ప్రయత్నానికి పలువురు అండగా నిలిచారు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు.? అతడి ప్రయాణం ఎలా సాగుతోంది.? అలాంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.

Plastic Tiles
Plastic Tiles
author img

By

Published : Jun 16, 2023, 5:15 PM IST

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్‌ తయారీ

Manufacture of Tiles from Plastic Waste : కరోనా తన ఉద్యోగాన్ని కొల్లగొడితే.. బాధపడుతూ ఇంట్లో కూర్చోలేదు ఈ యువకుడు. వినూత్నంగా ఆలోచించి ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్ తయారీ పరిశ్రమను నెలకొల్పి.. వ్యాపారవేత్తగా ఎదిగాడు. ప్లాస్టిక్‌ పునర్వినియోగం చేయాలని అనడమే తప్ప.. ఆచరణలో పెద్దగా కనిపించకపోవడంతో తనకి ఆలోచన వచ్చిందంటున్నాడు ఈ యువకుడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్ తయారీ చేస్తున్న ఈ యువకుడి పేరు జూపల్లి సాయికిరణ్‌. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి ఇతడి స్వస్థలం.

ఇంజినీర్‌ ఉద్యోగం చేస్తున్న సాయికిరణ్‌ కొవిడ్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. దానికి అధైర్యపడని యువకుడు.. టైల్స్‌ వ్యాపారం ప్రారంభించి ముందుకు సాగుతున్నాడు. కాగా పరిశ్రమ స్థాపనకు గల కారణాలను ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. తొలుత గాజు వ్యర్థాలతో టైల్స్‌ తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి లాభనష్టాలను బేరీజు వేసుకున్నాడు. మార్కెట్‌లోని సాధారణ టైల్స్‌ ధరతో.. గాజుతో తయారు చేయాలనుకున్న టైల్స్‌ వ్యయాన్ని అంచనా వేసుకున్నాడు.

Plastic Tiles Manufacture : మరోసారి ఆలోచించి ప్లాస్టిక్ వ్యర్థాల వైపు మొగ్గు చూపినట్లు సాయికిరణ్‌ చెబుతున్నాడు. తాను తయారు చేసే టైల్స్‌కు మిగతా టైల్స్‌కు గల తేడాను ఇలా వివరిస్తున్నాడు. మొదట్లో ముడిసరుకు కోసం కొంత ఇబ్బంది అయినప్పటికి.. ప్రస్తుతం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు స్వయంగా తన యునిట్ వద్దకే ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమను పరిశీలించిన పలువురు అధికారులు సైతం ప్రశంసించారని యువకుడు తెలిపాడు.

సాయికిరణ్‌ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా బంధువులతో కలిసి పెట్టుబడి పెట్టాడు. కాగా టైల్స్ తయారీ ఎలా సాగుతోందో వివరిస్తున్నాడు సాయికిరణ్‌. తమ ఉత్పత్తులు 50 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయని చెబుతున్నాడు. తన ప్రయత్నాన్ని అధికారులు అభినందించడమే కాక మరిన్ని చోట్ల ఆచరణ జరిగేలా కృషి చేస్తుండటం సంతోషాన్నిస్తుందని అంటున్నాడు. పర్యావరణహితానికి తనవంతు బాధ్యతతోనే ఈ సంస్థ నెలకొల్పానని అంటున్నాడు యువ వ్యాపారి.

Making Tiles with Plastic : పరిశ్రమను మరింత విస్తరించేందుకు.. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. సాయికిరణ్‌ చేస్తున్న వ్యాపారం అతడికే కాకుండా తమ అందరికి సంతోషాన్ని ఇస్తుందని అంటున్నారు సాయికిరణ్‌ బంధువులు. ఆటంకాన్నే అవకాశంగా తీసుకోవడం కరోనా సమయంలోనే అలవాటైందని చెబుతాడు యువవ్యాపారి సాయికిరణ్‌. వినూత్నంగా ఆలోచించి ముందుకెళ్తున్న ఈ యువకుడు వ్యాపారంలో సక్సెస్‌ అవ్వాలని పలువురు కోరుతున్నారు.

"నేను బీటెక్ చదివాను. ఆతర్వాత హైదరాబాద్‌లో జాబ్ చెేశాను. కరోనా తర్వాత రీసైక్లింగ్ యూనిట్ మీద పరిశోధనలు చేశాను. ఇందుకు సంబంధించిన యంత్రాలను తయారుచేయించాం. సిమెంట్ టైల్స్ ఎక్కువకాలం ఉండవు. కానీ ఈ ప్లాస్టిక్ టైల్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. తన ప్రయత్నాన్ని అధికారులు అభినందించడమే కాక మరిన్ని చోట్ల ఆచరణ జరిగేలా కృషి చేస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది." - జూపల్లి సాయికిరణ్, యువ వ్యాపారి

ఇవీ చదవండి: Bio Reform Company: 'ఈ అంకుర సంస్థ ఏకో ఫ్రెండ్లీ బ్యాగ్​లకు చాలా చరిత్రే ఉంది'

ఏటీఎంలో కాటన్​ బ్యాగ్​.. 'ప్లాస్టిక్ ఫ్రీ సిటీ'యే లక్ష్యం!

ప్లాస్టిక్ బకెట్లు, సైకిల్ టైర్లతో బుల్లి 'విమానం'.. 8 గంటల్లోనే తయారీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.