పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామాన్ని పాలనాధికారి సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, వ్యక్తిగత పారిశుద్ధ్యంపై ఆరా తీశారు.
గ్రామం పచ్చగా ఉండాలంటే... ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో నర్సరీనీ పరిశీలించి మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేడారం జాతర తర్వాత సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.