ETV Bharat / state

సన్నవరికి మద్దతు ధర ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఆందోళన - పెద్దపల్లి జిల్లా తాజా సమాచారం

ప్రభుత్వ ఆదేశాలతో సన్నవరి వేసిన రైతన్నలకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు.

Congress dharna to demand give support pricr small paddy farmers
సన్నవరికి మద్దతు ధర ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఆందోళన
author img

By

Published : Nov 12, 2020, 3:13 PM IST

సన్నవరికి మద్దతు ధర రూ.2500 ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ప్రభుత్వమే సన్నవరి వేయాలని చెప్పి, మద్దతు ధర కల్పించకపోవడం దారుణమన్నారు.

మద్దతు ధర లేక రైతన్నలు అప్పుల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలుకు రూ.2500 చెల్లించేవరకు కాంగ్రెస్‌ ఆందోళన కొనసాగిస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మంత్రులు, తెరాస ప్రధాన కార్యదర్శులతో కేసీఆర్‌ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.