పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 68 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన అధికారులను, దాతలను సీపీ అభినందించారు.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిల్లో వినియోగించుకుంటుందని సీపీ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ప్రజలతో మమేకం అవుతూ... సత్వర న్యాయం అందించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా కృషి చేస్తున్నామన్నారు. శాంతి భద్రతల విషయంలో, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం హరితహారంలో పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఇవీ చూడండి: పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నేరస్థులు హతం