పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య అనంతరం పోలీసులపై వస్తున్న ఆరోపణలను రామగుండం సీపీ సత్యనారాయణ ఖండించారు. న్యాయవాద దంపతులపై దాడి జరిగిన నేరస్థలిని ప్రొటెక్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. హత్య జరిగిన సమాచారం అందగానే రామగిరి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లలను నేరస్థలిలో ఆధారాలు చెదరకుండా బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ మహేందర్‌ను నేరప్రదేశం వద్ద పర్యవేక్షించాలని తెలిపినట్లు సీపీ పేర్కొన్నారు. క్లూస్ టీం సహాయంతో పూర్తి ఆధారాలు సేకరించాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. సీఐ, ఎస్ఐ, స్పెషల్ పార్టీ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. హత్యస్థలిని ప్రొటెక్ట్ చేయలేదని, వివరాలు సేకరించలేదనే ఆరోపణలో నిజం లేదని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.