ETV Bharat / state

'మత్స సంపదపై ఆధారపడిన గంగపుత్రులకు సౌకర్యాలేవి ?' - అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త తాజా వార్తలు

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త పర్యటించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులకు బెస్తపల్లికి చెందిన గజ ఈతగాళ్లు గుర్తుకువస్తారని విమర్శించారు. గంగపుత్రులకు మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్​ చేశారు. నవంబర్ 21న గంగపుత్ర దివస్​ను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

All India Gangaputra Mahasabha National President satyam on bestapally gangaputras
'మత్స సంపదపై ఆధారపడిన గంగపుత్రులకు సౌకర్యాలేవి?'
author img

By

Published : Nov 3, 2020, 4:12 PM IST

Updated : Nov 3, 2020, 11:44 PM IST

గంగపుత్రుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త అన్నారు. నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్ర దివస్​ను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామ సమావేశంలో పాల్గొన్నారు.

అప్పుడే గుర్తొస్తారు:

"బెస్తపల్లి గ్రామంలోని అన్ని కుటుంబాలు కలిసి గంగామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గంగపుత్ర దివస్​ను నిర్వహించుకొని గంగపుత్రుల ఐక్యతను చాటాలి. గోదావరి నదిపై నిర్మించిన పార్వతి బ్యారేజ్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే బెస్తపల్లి గ్రామం ఉంది. అయినా గంగ పుత్రులు ఎలాంటి హక్కులు పొందలేకపోతున్నారు.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అధికారులు బెస్తపల్లికి చెందిన గజ ఈతగాళ్లను వాడుకుంటారు. తర్వాత వాళ్లను పట్టించుకునేవారే ఉండరు. జీవో నంబర్ 6ను ప్రభుత్వం రద్దు చేయాలి. గ్రామం నుంచి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి గ్రామానికి వచ్చే విధంగా.. గ్రామంలో మత్స సొసైటీలు ఏర్పాటు చేయాలి. వారి జీవనోపాధికి బాటలు వేయాలి."

-సత్యంబెస్త, అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు

బెస్తపల్లి గ్రామంలో 200 కుటుంబాల్లోని 800మంది ప్రజలు పూర్తిగా మత్స సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. వీరికి సొసైటీలు లేక ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలు రాక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజ నర్సయ్య గంగపుత్ర, సంఘం అధ్యక్షుడు నగేశ్ గంగపుత్ర, మహాసభ నేతలు మొండయ్య గంగపుత్ర, మేడి తిరుపతి బెస్త, గుమ్ముల లక్ష్మినారాయణ గంగపుత్ర, తోకల రమేశ్ గంగపుత్ర తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

'మత్స సంపదపై ఆధారపడిన గంగపుత్రులకు సౌకర్యాలేవి ?'

ఇదీ చూడండి: రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈవోను కలిసిన పీసీసీ అధ్యక్షుడు

Last Updated : Nov 3, 2020, 11:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.