దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టేలా ఓ కఠిన చట్టం తేవాలని ప్రధాని మోదీని కలిసి విన్నవిస్తానని ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఎన్కేపాడుకు చెందిన నాగ అనే యువకుడు విజయవాడ నుంచి దిల్లీ వరకు పాదయాత్ర చేపట్టారు.
ఈనెల 17న ప్రారంభించిన ఈ యాత్రలో భాగంగా నాగ.. నిజామాబాద్‌కు చేరుకున్నాడు. దిల్లీ నిర్భయ ఘటన తనను ఎంతో ఆలోచింపజేసిందన్న నాగ.. నేటి సమాజంలో మహిళల పట్ల చూపుతున్న వివక్ష, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసన వ్యక్తం చేశారు. సమాజంతో మార్పు కోసం తాను ముందడుగు వేశానని చెబుతున్నాడు.