నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యనంపల్లిలో అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా నష్టపోయిన పంటలను తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
వర్షాలతో రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని అన్నారు. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం సాయం అందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దుబ్బాకలో కాకుండా పంటలు నష్టపోయిన ప్రాంతంలో తిరగాలని సూచించారు. దుబ్బాక ఉప ఎన్నికపై కేసీఆర్కు ఉన్న ప్రేమ.. రైతులపై ఏమాత్రం లేదని ఎల్.రమణ విమర్శించారు.
ఇదీ చదవండి: కేంద్ర బలగాలతో దుబ్బాక ఉప ఎన్నికలు నిర్వహించాలి: భాజపా