నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్‌పై అధికార పక్షం కార్యకర్తలు భగ్గుమన్నారు. జిల్లాలో పలు చోట్ల తెరాస మహిళా కార్యకర్తలు, నాయకులు ఎంపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. తీరు మార్చుకోవాలని నేతలు హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వ్యాఖ్యలను నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఖండించారు.
ఇదీ చూడండి: ఐపీఎల్లో 10 జట్లు.. బీసీసీఐ కీలక నిర్ణయం!