నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
నామపత్రాలు దాఖలు చేసే ముందు నిజామాబాద్ జిల్లా నేతలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో జిల్లాకే చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
మరోవైపు కవితకు ఎంపీ సంతోష్ శుభాకాంక్షలు తెలిపారు. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెస్తారంటూ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత