స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేందర్ అనే విద్యార్థి ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా విద్యార్థికి సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి కిషన్, గైడ్ టీచర్ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నుంచి 25 మంది విద్యార్థులు పాల్గొనగా.. మహేందర్ ప్రదర్శించిన విద్యుత్ లేకుండా నీటిని ఎత్తిపోసే యంత్రం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం