నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెడోరా మండలాల్లో ఇవాళ తెల్లవారుజామున దట్టంగా పొగమంచు ఆవహించింది. రాత్రి స్వల్పంగా వర్షం కురువగా... ఉదయం ఏడు గంటల వరకు పొగమంచు మబ్బులాగా దట్టంగా కనిపించింది. రోడ్డు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. పొంగమంచుతో 44వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి.
ఇదీ చూడండి: క్లాస్‌రూంలో చిన్నారి..బడికి తాళమేసిన సిబ్బంది