నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది. ఎం-3 రకం ఈవీఎంలను సరఫరా చేయాలని ఈసీఐఎల్‌ను కోరింది. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్‌లు అందించాలని ఈసీపేర్కొంది. 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్ యంత్రాలు అందించాలని ఈసీఐఎల్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది.
'ఈవీఎంలతోనే ఇందూరు లోక్సభ ఎన్నికలు'
పసుపు, ఎర్రజొన్న రైతుల నామినేషన్లతో నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించడం వల్ల ఉత్కంఠ వీడింది.