నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్లకు చెందిన సచిన్కుమార్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2019 ఫలితాల్లో 296వ ర్యాంకు సాధించాడు. సచిన్ జిల్లాకు, అతని తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచాడు.
సచిన్కుమార్ 26 ఏళ్లకే దేశంలోనే అత్యున్నత సర్వీసుకు ఎంపికయ్యారు. తపన, ప్రతిభా, కృషి ఉంటే అవే ముందుకు నడిపించి.. మనల్ని ఉన్నత లక్ష్యాలు చేరుస్తాయని సచిన్ అంటున్నారు. మంచి ర్యాంక్ సాధించినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.