నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన భూపతిరెడ్డిపై అనర్హతా వేటు కారణంగా ఆ స్థానం ఖాళీ అయింది. ఉపఎన్నిక అనివార్యమైంది. మొన్నటి వరకు రాష్ట్రంలోని పురపాలక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో కనీసం 75 శాతం ఓటర్లు ఉంటేనే ఎన్నిక నిర్వహించడం సాధ్యమవుతుంది. ఇటీవల పురపాలిక ఎన్నికలు పూర్తవడంతో ఓటర్ల పూర్తి జాబితా సిద్ధమైంది.
ఎన్నిక నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఇప్పటికే నివేదించింది. నిజామాబాద్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు ఈసీ త్వరలోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
సంబంధిత కథనాలు: భూపతిరెడ్డిపై అనర్హత వేటుకు కారణమేంటి?