నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. అనవసరంగా బయటకు వచ్చి వైరస్‌ను ఇంట్లోకి తీసుకెళ్లొద్దన్నారు.
బోధన్ పట్టణంలోని కంటైన్మెంట్ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. కొత్తగా వచ్చిన 3 కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58కి చేరిందని తెలిపారు. రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తోన్న నగదు తీసుకోవడానికి ఏటీఎంల వద్ద గుమిగూడొద్దని సూచించారు.
బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలని, ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంలో ప్రజలపాత్ర కీలకమన్నారు.