ETV Bharat / state

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ అర్వింద్ - సర్కారుపై ఎంపీ అర్వింద్ కమెంట్స్

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ ధర్మపురి అర్వింద్ సందర్శించారు. కరోనా ఐసీయూ వార్డులో తిరిగారు. రోగులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయుష్మాన్ భారత్​ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

corona
corona
author img

By

Published : May 25, 2021, 7:49 PM IST

ఆయుష్మాన్ భారత్​ను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలు అప్పులు చేసి కరోనా చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్​పై స్పష్టత లేదన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పతిలో కరోనా ఐసీయూ వార్డును ఎంపీ అర్వింద్ సందర్శించారు. రోగులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అందుతున్న వైద్య సేవలు, వసతులపై వైద్యాధికారులతో మాట్లాడారు.

ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మహమ్మారి విజృంభిస్తుంటే వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. కనీస వసతులు లేకుండానే ప్రభుత్వ ఆస్పత్రులు చికిత్స అందించాయన్నారు. ఉత్తర తెలంగాణకు మెడికల్ హబ్​గా పేద ప్రజలకు వైద్యం అందిస్తోన్న నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా సర్కారు తన ప్రాధాన్యతను మార్చుకొని వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.