MP Arvind on State Government: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ అర్వింద్‌ను తెరాస నాయకులు అడ్డగించారు. గంట ముందు నుంచి తెరాస శ్రేణులు గన్నారం ముఖద్వారం వద్ద ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలకు రావడం ఏంటి అని నిరసనలు వ్యక్తం చేశారు. అడ్డగింత కార్యక్రమాన్ని ముందస్తుగానే గుర్తించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఎంపీ కాన్వాయ్ రాగానే ఒక్కసారిగా తెరాస నాయకులు కారు ముందుకు దూసుకు వచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పక్కకు నెట్టి కారును ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ లోపు తమ నాయకుడిని అడ్డుకుంటున్నారని గ్రహించిన భాజపా నాయకులు ఎదురుగా వచ్చి తెరాస నాయకులను పక్కకు నెట్టడం వల్ల ఇరువర్గాల మధ్య కొద్దిపాటి గొడవ చోటుచేసుకుంది. పోలీసులు కలుగజేసుకొని కాన్వాయ్‌ను ముందుకు పంపడంతో గొడవ సద్దుమణిగింది.
ఆపే శక్తి ఎవరికి లేదు..
MP Arvind comments on State Government: అనంతరం గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఎంపీ అర్వింద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామానికి వస్తున్న తనను అడ్డుకుని గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఫేమస్ చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు అంటూ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. తనను ఆపే శక్తి ఎవరికి లేదని, ప్రజా శ్రేయస్సు కోసం జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కలిసి పని చేసుకోవాలన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో 60 శాతం నిధులు కేంద్రానివేనని ఆయన ఉద్ఘాటించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రం కోడి గుడ్డు కూడా కొనలేదని ఎద్దేవా చేశారు.
రాజకీయాలకు ఇంకా సమయం ఉంది..
BJP MP Dharmpuri Arvind: తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసని, రాజకీయాలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. భాజపా కార్యకర్తలు తల్చుకుంటే కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేయగలరన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరూ కింగ్‌లు కారని, కేసీఆర్ మందు కొట్టి ఇదే రాచరికం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నలుగురు రౌడీలను పెట్టి ఆపాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అనంతరం నల్లవెల్లి గ్రామంలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరయ్యారు.
60 శాతం నిధులు కేంద్రానివే..
నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో 60 శాతం నిధులు కేంద్రానివే. కేంద్రం నిధులివ్వకపోతే రాష్ట్రం కోడిగుడ్డు కూడా కొనలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలుసు. రాజకీయాలకు ఇంకా సమయం ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరూ కింగ్‌లు కాదు. కేసీఆర్ మందు కొట్టి ఇదే రాచరికం అనుకుంటున్నారు. -ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ఇదీ చదవండి: