ETV Bharat / state

చదువుల తల్లికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత.. ఎంబీబీఎస్ మొత్తం ఫీజు భరిస్తానని హామీ

MLC Kavitha Helps to MBBS Student: చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యూట్యూబ్‌లో క్లాసులు విని... ఎంబీబీఎస్​కి అర్హత సాధించిన చదువుల తల్లి హారికకు ఆమె అండగా నిలిచి భరోసా కల్పించారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని కవిత కొనియాడారు. విద్యార్థులంతా ఆ యువతిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

MLC Kavitha
MLC Kavitha
author img

By

Published : Nov 9, 2022, 3:23 PM IST

MLC Kavitha Helps to MBBS Student: చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచి భరోసా కల్పించారు. నిజామాబాద్‌ జిల్లా నాందేవ్‌గూడకు చెందిన హారిక యూట్యూబ్‌లో క్లాసులు విని... ఎంబీబీఎస్​కి అర్హత సాధించింది. హారిక వైద్య విద్యను అభ్యసించేందుకు ఫీజు కట్టలేక దాతల కోసం ఎదురు చూసింది. ఆమె పరిస్థితిని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత వెంటనే స్పందించారు.

నిజామాబాద్ పర్యటనలో ఉన్న కవిత హారికను కలుసుకొని ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసేందుకయ్యే ఖర్చును భరిస్తానని భరోసా కల్పించి తొలి ఏడాదికి చెందిన కాలేజీ ఫీజును చెక్కురూపంలో అందించారు. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని కవిత స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని కొనియాడారు. విద్యార్థులంతా ఆ యువతిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఎంబీబీఎస్‌ చదువులో రాణించి వైద్యురాలిగా సమాజ సేవలు అందించాలని కవిత ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత వైద్య విద్య చదువుకు అండగా నిలిచినందుకు హారికతోపాటు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్యాగానికి లోనయ్యారు. కవిత సూచించినట్లు వైద్య విద్య పూర్తి చేసి సమాజానికి తోడ్పాటునందిస్తానని హారిక తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.