నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్‌లో మిషన్ భగీరథ పైపులైన్ లీకైంది. జలాల్‌పూర్ పంప్‌హౌస్ నుంచి తాగునీటి సరఫరా అయ్యే పైప్ లీకేజీ అయింది. పాత జాతీయ రహదారిపైకి పెద్దఎత్తున నీరు చేరింది.
లీకేజీ అయిన ప్రాంతంలో పెద్ద గుంత పడడంతో పాటు.. సమీపంలో ఇసుక మేటలు వేశాయి. సుమారు గంట పాటు తాగునీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారులు వచ్చి నీటి సరఫరాను నిలిపివేశారు.
ఇదీ చూడండి: అ..ఆ..లు దిద్దకుండానే రెండులోకి...