రెండు రోజుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజమాబాద్ జిల్లా బాల్కొండలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధిలో భాగంగా.. నియోజకవర్గ పరిధిలోని ఏర్గట్ల, ముప్కాల్ మండలాల్లో కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాల భవనాలకు శంకుస్థాపనతో పాటుగా.. వేంచిర్యాల్ గ్రామంలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పథకాలు ప్రవేశపెట్టలేదు
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. భాజపా అధికారం లో ఉన్న ఏ ఒక్క రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న పథకాలు ప్రవేశపెట్టలేదని భాజపా నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆయన సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు