నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో... హనుమాన్ జంక్షన్‌లోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిఖార్సైన నిబద్ధత కలిగిన తెలంగాణవాది లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. 1969 ఉద్యమంలో బాపూజీ కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా: తెరాస అభ్యర్థి సైదిరెడ్డి