నిజామాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. భీంగల్లో సోమవారం కలీం హత్యకు నిరసనగా ఇవాళ పట్టణంలో బంద్కు పిలుపునిచ్చారు. కుటుంబీకులు, బంధువులు భారీ ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అదనపు బలగాలను మోహరించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: "బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు"