మేడేను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర కార్యాలయంలో గోడప్రతుల ఆవిష్కరణ చేశారు. ఇప్పటికైనా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓమయ్య కోరారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి... అందరినీ పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ మానుకోవాలని... రాజ్యాంగం ప్రకారం కార్పొరేట్ల ఆస్తులను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ రంగాల కార్యాలయాల ముందు ఉద్యోగ కార్మికులు అందరూ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వెల్లడించారు.
ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు