Farmers Agitation In Nizamabad: ఇప్పటికే వరికి సరైన మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు వంటి అఘాయిత్యాలు చేసుకుంటే.. వారికి మద్దతుగా వెన్నంటే నిలవాల్సింది పోయి..ఆ రైతులకే అన్యాయం చేయాలని చూశాడో వడ్ల వ్యాపారి. రైతులే కదా వారికి వేలి ముద్ర తప్ప చదవడం రాదని భావించి.. కాలం చెల్లిన చెక్కులను ఇచ్చి.. వారిని నిలువునా దోపిడీ చేద్దామనుకున్నాడు. ఎప్పటికైనా కష్టపడి సంపాదించిన సంపద.. బూడిద పాలు కాదని పెద్దలు అంటూ ఉంటారు కదా అదే ఇప్పుడు నిజమైంది. ఈ విషయంపై వ్యాపారిని రైతులు నిలదీశారు.
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం డబ్బుల కోసం రైతులు ఆందోళనకు దిగారు. వడ్లు కొనుగోలు చేసిన వ్యాపారి ఇంటి వద్ద బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు చెప్పిన వివరాల ప్రకారం.. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేసినా.. ఇప్పటికీ కొందరి రైతులకు ఆ డబ్బులు అందలేదు. అందుకే తాము నగరంలోని హమాల్ వాడికి చెందిన ఓ ధాన్యం వ్యాపారి ఏడాది క్రితం నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాడు.
Grain Merchant Bounced Checks To Farmers: అందుకు ఆ వ్యాపారి విడతల వారిగా నగదును ఇస్తానని చెప్పుకొని వచ్చాడు. ఏడాది పాటు ఇలానే అంటూ వస్తున్నాడు. ఇదే విషయంపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడకు వచ్చిన వడ్ల వ్యాపారి శ్రీనివాస్ తమకు రావాల్సిన డబ్బును వాయిదాల రూపంలో చెల్లిస్తానని చెప్పి.. అక్కడే 150 మంది రైతులకు గానూ రూ.1.70కోట్లను చెక్కుల రూపంలో అందరికీ పంచి ఇచ్చాడు.
కాలం చెల్లిన చెక్కులు: ఈ విధంగా అయినా తమ డబ్బు వచ్చిందనే ఆనందం.. ఆ రైతులకు ఎంతో సేపు నిలువ లేదు. బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకుందామని చూస్తే ఇది కాలం చెల్లిన చెక్కు అని బ్యాంకు అధికారులు తెలపడంతో.. శ్రీనివాస్ ఇంటికి వెళ్లి నిలదీశారు. ఆ వెంటనే స్థానిక ప్రజాప్రతినిధితో మాట్లాడించి మీ డబ్బును 15రోజుల్లో తీరుస్తానని అతనితో మాట ఇప్పించాడు.
గడువు ముగిసిన తర్వాత రైతులు ఇంటికి వెళ్లి అడిగితే తనని కొడుతున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి పారిపోయి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నాడు. దీంతో ఆ రైతులు ఆగ్రహంతో వ్యాపారి ఇంటి ముందు బైఠాయించి.. నిరసన తెలిపారు. వెంటనే తమ డబ్బును చెల్లించాలని కన్నీరు పెట్టుకున్నారు. అక్కడకు పోలీసులు చేరుకుని ఆందోళన విరమింపజేశారు.
ఇవీ చదవండి: