"Padma Shri Awardee Padmaja Reddy: కూచిపూడిలో నాకు పద్మ శ్రీ అవార్డు రావడం బాధ్యతగా భావిస్తున్నాను. ఈ కళను ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నదే నా లక్ష్యం. కూచిపూడిలో ఇప్పటివరకు 700 మందికి శిక్షణ ఇచ్చాను. 3000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఆడశిశువులను చంపేసి చెత్తకుప్పల్లో పడేయడం నన్ను చాలా కదిలించింది. అందుకే భ్రూణ హత్యలపై పలు ప్రదర్శనలు ఇచ్చాను. సామాజిక స్పృహ కలిగే అంశాలపై అవగాహన కలిగించేలా నృత్య రూపకంలో చేశాను. వాటికి పలు అవార్డులు దక్కాయి. కాకతీయుల కళను ప్రపంచానికి పరిచయం చేయడంలో దాదాపు 10 సంవత్సరాలకు పైగా పలు అధ్యయనాలు చేశాను. కాకతీయుల కాలంలో శిల్పాల వస్త్రధారణపై అవగాహన పెంచుకుని ప్రపంచానికి పరిచయం చేయడంలో నా వంతు కృషి చేశాను. మన సంస్కృతిని కాపాడేందుకు పిల్లలకు తల్లిదండ్రులు నాట్యం నేర్పించాలి." -- పద్మజా రెడ్డి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత
ఇదీ చదవండి: Minister Srinivas Goud: 'ఆరోపణలు చేస్తున్నవారి భరతం పడతా'