ETV Bharat / state

నగల చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్​

author img

By

Published : Jul 12, 2019, 10:53 PM IST

నిజామాబాద్​ నగరంలో నగల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మూడున్నర కిలోల వెండి నగలు, రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నగల చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్​

నిజామాబాద్​ నగరానికి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి అభరణాలు, నగదు చోరీ చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి మూడున్నర కిలోల వెండి ఆభరణాలు, రూ. 30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గత నెల 28న బోధన్​ పరిధిలో అర్ధరాత్రి సమయంలో నగర వ్యాపారి హరి గుప్తా కారును అడ్డగించిన దుండగులు 4 కిలోల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదును అపహరించారు. వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.

ఇవాళ బోధన్​ మండలం పెగడాపల్లి వద్ద అబ్దుల్​ రహమాన్​, మహ్మద్​ అమీర్​, ఇమ్మాన్​ అలీ, సయ్యద్​ ఆరీఫ్​, మహ్మద్​ పర్వేజ్​లను అరెస్ట్​ చేశారు. మరో నిందితుడు ఇర్ఫాన్​ పరారీలో ఉన్నట్లు అదనపు డీసీపీ శ్రీధర్​రెడ్డి తెలిపారు.

నగల చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్​

ఇవీ చూడండి: ప్లాట్​ఫాం మీదకు దూసుకొచ్చిన బస్సు..ప్రయాణికుడి మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.