సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని భాజపా కార్యాలయంలో నాయకులతో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. మక్కలకు డిఫరెన్స్ ప్రైస్ ఏదైతే ఉందో.. మార్కెట్ తేడాకు సగం డబ్బు కేంద్రమే అందిస్తుందన్నారు. మార్కెట్లో కౌంటర్లు ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పండించిన పంటను ఎక్కడ అమ్మాలో తెలియక రైతులు రోడ్లపై పోసుకుని ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు కరవుతీరా ఎరువులు ఇచ్చారన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాకే మక్కలకు రూ. 1100గా ఉన్న రేటు రూ. 1800గా పెంచారన్నారు. 24 గంటల కరెంటు రైతులకు అందించామన్నారు.