నిజామాబాద్లో భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా భాజపా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య హాజరయ్యారు. ఈ చట్టంతో రైతులు పండించిన పంటను స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే హక్కు కల్పించారని చెప్పారు.
రైతు అభివృద్ధే ధ్యేయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ చట్టాలను తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మూసీ ఉగ్రరూపం.. ముసారాంబాగ్ వంతెనపై వరద ప్రవాహం