నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కనీస వేతనాలు పెంచాలని, పెండింగ్లో ఉన్న పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాకార్యకర్తలు ర్యాలీగా వస్తుండగా... కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు అక్కడే ధర్నా చేశారు. గత ఐదు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాన్ని 18 వేలకు పెంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ