నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలంలోని గన్నారంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని డీసీఎంఎస్ ఛైర్మన్ సాంబరి మోహన్ ప్రారంభించారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు... దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ సూచించారు. మొక్కలు నాటే పద్ధతిని ఎఫ్ఆర్వో హిమచందన వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, ఎంపీడీఓ రాములు నాయక్ హాజరయ్యారు.