నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం నారాయణరెడ్డి జలాశయానికి జలకళ సంతరించుకుంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరింది. మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించి గేట్లను ఎత్తివేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693.6 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి 29,169 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ఎం. ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః మందమర్రిలో లీకైన మిషన్ భగీరథ పైప్ లైన్