నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద డీటీఓకు ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బస్సులు నడిపేందుకు డీటీఓ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను పిలిపించడం వల్ల ఆర్టీసీ కార్మికులు అధికారులతో గొడవకి దిగారు. 12 గంటల పాటు బస్సులను డిపో నుంచి బయటకి తీసేది లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ... డీటీఓ బలవంతంగా తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను పిలిపించి బస్సులు తీసే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. బంద్ ప్రశాంతంగా జరిగేందుకు కార్మికులు సహకరిస్తున్నట్లు, అధికారులూ సహకరించాలని కోరారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దు మణిగింది.
ఇవీ చూడండి: జేబీఎస్లో ఉదయమే మొదలైన బంద్ ప్రభావం