రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు బలపరుస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భాజపా భూస్ధాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సాగర్ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయం, తాజాగా సాగర్ ఉప ఎన్నికలో గెలుపే కేసీఆర్కు ప్రజాదరణ పెరిగిందనడానికి ఉదాహరణ అని కొనియాడారు.
ఇదీ చదవండి: నాగార్జున సాగర్లో జోరు తగ్గని కారు