శ్రావణమాసం చివరి సోమవారం కావడం వల్ల నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలోని సిరాల గ్రామ శివాలయానికి భక్తులు పోటెత్తారు. ముధోల్ నియోజకవర్గమే కాకుండా సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పోటెత్తడంతో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చూడండి :భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు