నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామానికి చెందిన రుమ్మల నర్సయ్య, గజ్జవ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నర్సయ్య ముధోలోని బోస్లే గోపాలరావు పటేల్ కంటి ఆసుపత్రిలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తుండగా... తల్లి బీడీలు చుడుతూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. భూమేష్ ముథోలోని సరస్వతీ శిశుమందిర్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం భూమేష్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఎలాగైనా సరే తమ కుమారుడిని రక్షించుకోవాలని రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
భూమేష్కి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు... ఆపరేషన్ కోసం ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. చేతిలో డబ్బులు లేక కొడుకుని వదులుకోలేక ఆ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన కుమారుడిని బతికించాలని కోరుతున్నాడు. నర్సయ్య పనిచేసేస ఆస్పత్రి సిబ్బంది 3 లక్షల రూపాయల సాయం చేసింది. అలాగే విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ 25 వేల రూపాయలను అందజేశారు. మరింత మంది దాతలు ముందుకు వస్తే... తన కుమారుడు ప్రాణాలతో బయటపడతాడని తండ్రి నర్సయ్య చెబుతున్నారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం