నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫరూఖీ అన్నారు. కలెక్టరేట్లో పారిశుద్ధ్యం, పట్టణ ప్రగతి పనులపై పురపాలక శాఖ అధికారులతో ఆయన సమావేశం జరిపారు.
టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి నూతన మాస్టర్ ప్లాన్ త్వరగా అనుమతులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరించేందుకు ఆటోలు, ట్రాక్టర్లు, రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ మిషన్ల కొనుగోలుకు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.
పారిశుద్ధ్య కార్మికులకు రిప్లేక్టర్ జాకెట్లు, బ్లౌజులు, బూట్లు ఆగస్టు 15న పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి వార్డులో ట్రీ పార్కు, నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల నివాస, వ్యాపార సముదాయాలు, మున్సిపల్ శాఖకు సంబంధించిన వ్యాపార సముదాయాల్లో అద్దె వసూలు చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న లే ఔట్లను, భవనాలను నిలిపివేయాలన్నారు. ఆర్థిక, అడిట్ అంశాలను పరిశీలించి, టౌన్‌ప్లానింగ్ అధికారులు, బిల్ కలెక్టర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
ఇదీ చూడండి : దొంగతనం చేశాడని బాలుడి కాళ్లు కట్టేసి.. ఈడ్చుకెళ్లి...