ETV Bharat / state

నియంత్రిత పద్ధతిలో సాగు జరిగేలా చూడాలి : కలెక్టర్ ముషర్రఫ్​ ఫారుఖీ - Agriculture News

జిల్లాలో నియంత్రిత పద్ధతిలో సాగు విధానం అమలయ్యేలా చూడాలని, క్లస్టర్ల వారిగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్మల్​ జిల్లా కలెక్టర్​ ముషర్రఫ్​ ఫారుఖీ అన్నారు. జిల్లాలో నియంత్రిత సాగు అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Nirmal Collector Conference On Crop Plan
నియంత్రిత పద్ధతిలో సాగు జరిగేలా చూడాలి : కలెక్టర్ ముషర్రఫ్​ ఫారుఖీ
author img

By

Published : May 24, 2020, 8:04 PM IST

నిర్మల్​ జిల్లా కలెక్టర్​ సమావేశ మందిరంలో నియంత్రిత సాగు పద్ధతుల గురించి జిల్లా కలెక్టర్ ముషర్రఫ్​ ఫారుఖీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జిల్లాలో నియంత్రిత సాగు పద్ధతిలో రైతులంతా వ్యవసాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్లస్టర్ల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

పంటసాగు, మార్కెటింగ్ ఆధారంగా లాభం వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఉద్ధేశించి మాట్లాడారు. రైతులు సాగు చేసే పంట వివరాలు అధికారులు రికార్డు చేయాలని, జిల్లాలో ఏయే పంటలు పండుతున్నాయో సమగ్ర సమాచారం జిల్లా అధికారుల దగ్గర ఉండాల్సిందే అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఏడీ కోటేశ్వరరావు, వినయ్​ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.