ETV Bharat / state

పూలే ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ - తెలంగాణ వార్తలు

మహాత్మ జ్యోతిరావు పూలే ఆదర్శాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.

minister indrakaran reddy tribute, mahatma jyotiba phule birth anniversary
మహాత్మ జ్యోతిబాపూలేకు ఇంద్రకరణ్ నివాళి, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
author img

By

Published : Apr 11, 2021, 1:34 PM IST

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో పూలే 195వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి మంత్రి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు.

పూలే బాటలో..

పూలే స్ఫూర్తితోనే దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి రాఠోడ్ రమేశ్, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భూపతిపూర్​లో అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.