నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. కాల్వ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రూ. కోటి 20 లక్షలతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతులకు సలహాలు సూచనలు అందిస్తామన్నారు.