ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొయ్యబొమ్మల పరిశ్రమను కాపాడుకోవాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. కళాకారురులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొయ్యబొమ్మల పరిశ్రమ ఆవరణలో రూ. 65 లక్షలతో నూతనంగా నిర్మించిన బొమ్మల తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
చర్యలు చేపడతాం..
నిర్మల్ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది కొయ్యబొమ్మలేనని ఇంద్రకరణ్ అన్నారు. బొమ్మల కేంద్రానికి తమవంతుగా సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించి కలను కాపాడుకోవాలని సూచించారు. బొమ్మల తయారీకి కావలసిన పుణికి కర్ర పెంపకానికి చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: పొలం బాటలో ఇంజినీర్..డ్రోన్లతో వ్యవసాయం