ETV Bharat / state

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - Indrakaran reddy news

నిర్మల్ జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. నిర్మిస్తున్న సమీకృత భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Minister review
ఇంద్రకరణ్ రెడ్డి రివ్యూ
author img

By

Published : Mar 31, 2021, 7:15 PM IST

నిర్మల్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలనా ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షకు ఆయన హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

2022 మార్చి నెల వరకు భవనాన్ని పూర్తిచేసి అప్పజెప్పాలని ఆదేశించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం వరి ధాన్యం కొనుగోలు గత సంవత్సరం మాదిరిగా గ్రామాల్లోకి వెళ్లి కొనుగోళ్లు చేపట్టేందుకు పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు కరోనా బారినపడకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు.

జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షలో పాలానాధికారి ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆ కుటుంబంలో వారసత్వంగా పుడుతున్న కవలలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.