రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మ తిథిని పురస్కరించుకుని... అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
సరస్వతి అమ్మవారి సన్నిధిలో.. తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం బాసరకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. బాసర వద్ద గోదావరిలో పుణ్య స్నానాలు భక్తులు పెద్ద సంఖ్యలో ఆచరిస్తున్నారు.
ఇదీ చూడండి: బాసరలో వసంత పంచమి వేడుకలు