నిర్మల్ జిల్లా కడెం మండలం బుట్టాపూర్ గ్రామ సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ (ఎం), గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భార్య స్థానంలో భర్త సర్పంచ్‌గా చెలామణి అవుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొమ్మెన సురేష్ మండిపడ్డారు. నిలదీసిన వారిపై సర్పంచ్ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఫిర్యాదుపై నిర్లక్ష్యం..
కలెక్టర్ కార్యాలయంలో గతంలోనే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే సర్పంచ్ భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు వెంకటేశ్, తిరుపతి, బద్దయ్య, బుచ్చయ్య, రాజన్న, వినోద్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.