నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహాబూబ్ఘాట్ వద్ద కారు అదుపు తప్పి లోయలో పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. నిర్మల్ ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న అర్జున్‌రావు, మరో ఇద్దరు ఫీల్డ్ ఆఫీసర్లు ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కారులో ప్రయాణిస్తున్న అర్జున్ రావు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు ఫీల్డ్ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. మృతి చెందిన అర్జున్ రావుది బోధన్‌లోని సాలూరు. క్షతగాత్రులను నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : పెయింట్ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త!