నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు జరిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భైంసాలో కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా బయటికి రావద్దన్నారు.
ప్రజలు సంయమనం పాటించి పోలీసు వారికి సహకరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్గించవద్దని సూచించారు. భైంసా ఘటనకు సంబంధించి మత ఘర్షణలో 21 మందిని, లాక్డౌన్ ఉల్లంఘించిన కేసులో 40 మందిని అరెస్టు చేశామని చెప్పారు. భైంసా పట్టణంలో రెండు రోజులుగా ప్రశాంత వాతావరణం కొనసాగుతోందన్నారు.
ఇదీ చూడండి : ఈనాడు-ఈటీవీ భారత్ చొరవ.. వలస కూలీలకు ఎర్రబెల్లి చేయూత