ETV Bharat / state

'పొగాకు ఉత్పత్తుల చట్టం రద్దు చేయాలి' - Nirmal District Latest News

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు. పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. తహసీల్దార్ కవిత రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Beedi workers staged a dharna
పొగాకు ఉత్పత్తుల చట్టం రద్దు చేయాలని బీడీ కార్మికుల ధర్నా
author img

By

Published : Mar 3, 2021, 9:05 PM IST

కేంద్రం తీసుకొచ్చిన పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్​టీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల రాజన్న డిమాండ్​ చేశారు. కొత్త చట్టంతో బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో కార్మికులు జిల్లాలోని లక్ష్మణచాంద మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. మండల కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు.

తహసీల్దార్ కవిత రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బీడీ కార్మికుల పొట్టగొట్టే పొగాకు ఉత్పత్తుల చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: పసుపు పంటకు పెరుగుతోన్న ధర... రైతులు సంతోషమేనా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.